calender_icon.png 14 October, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

14-10-2025 07:36:29 PM

మంథనిలో అధికారులతో రివ్యూలో మంత్రి శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): మంథనిలో నిధులు మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని మంథని గోదావరి బ్రిడ్జి పనులను(శ్రీపాద) రింగ్ రోడ్డు పనులను సంబంధించి ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులతో, కంపెనీ ప్రతినిధులతో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, శ్రీపాద రింగ్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి, వేగవంతం చేయాలని అధికారులను, బ్రిడ్జ్, రోడ్డు కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. 

రూ. 4.50 కోట్లతో మంజూరైన ఆర్ అండ్ బి అతిథిగృహానికి స్థల సేకరణ చేయాలని, వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు. మంథని మున్సిపాలిటీలో రూ. 10 కోట్లతో మంజూరైన అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కు స్థలం లేని వాటికి వెంటనే ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు చేసుకోవడానికి అందజేయాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. మంథనిలో హమాలీ సంఘం, ఆటో నడుపుకుని ఆటో కార్మికులకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వారికి ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా ఖాళీ స్థలాలను గుర్తించాలని తెలిపారు‌. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ, రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తాసిల్దార్ కుమార్ యాదవ్, జేఈ, కంపెనీ ప్రతినిధులు, పాల్గొన్నారు.