calender_icon.png 14 October, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగులోని జాతర చైర్మన్ గా గంగుల రమణారెడ్డి

14-10-2025 07:33:26 PM

రేగొండ (విజయక్రాంతి): బుగులోని జాతర నూతన చైర్మన్ గా గంగుల రమణారెడ్డి ఏకగ్రీవమయ్యారు. మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో జరిగే శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి జాతర నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమికి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. దీంతో ఈ యేడు జాతర చైర్మన్ గా గంగుల రమణారెడ్డి నియామకం అయ్యారు. దీంతో మంగళవారం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చొరవతో బుగులోని జాతరను అభివృద్ధి చేస్తామని జాతరలో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా పనులు చేపడుతామని అన్నారు. అలాగే జాతర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.