calender_icon.png 14 October, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమెంట్ కర్మాగారంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి..

14-10-2025 07:40:16 PM

లేదంటే  కర్మాగారం మూయించేస్తాం.. ఎంపీ కొండ 

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యంతో పరిసర గ్రామ రైతుల పంట తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలని లేదంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన నిర్వహించి మూసేస్తామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడుతూ తీవ్ర స్వరంతో అన్నారు. మంగళవారం ఆయన సంగం కలాన్ గ్రామ రైతులకు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా, స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.