calender_icon.png 15 October, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

15-10-2025 12:24:27 AM

మంథనిలో అధికారులతో రివ్యూలో మంత్రి శ్రీధర్ బాబు

మంథని అక్టోబర్ 14 (విజయ క్రాంతి) మంథనిలో నిధులు మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని  మంథని గోదావరి బ్రిడ్జి పనులను (శ్రీపాద) రింగ్ రోడ్డు పనులను సంబంధించి ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులతో, కంపెనీ ప్రతినిధులతో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, శ్రీపాద రింగ్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి, వేగవంతం చేయాలని అధికారులను, బ్రిడ్జ్ మరియు రోడ్డు కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. రూ. 4.50 కోట్లతో మంజూరైన ఆర్ అండ్ బి అతిథిగృహానికి స్థల సేకరణ చేయాలని, వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు. మంథని మున్సిపాలిటీలో రూ. 10 కోట్ల తో మంజూరైన అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కు స్థలం లేని వాటికి వెంటనే ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు చేసుకోవడానికి అందజేయాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. మంథనిలో హమాలీ సంఘం మరియు ఆటో నడుపుకుని ఆటో కార్మికులకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వారికి ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా ఖాళీ స్థలాలను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ, రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తాసిల్దార్ కుమార్ యాదవ్, జేఈ, కంపెనీ ప్రతినిధులు, పాల్గొన్నారు.

ఆ భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలి

 మంథని, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ఆ భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోరుకోవాలని మంథని పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా  రిపోర్టర్ మిరియాల సాగర్ యాదవ్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధైర్యం నింపాడు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు వెళ్లి వస్తున్న  సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా సాగర్ ను మంగళవారం రాష్ట్ర మంత్రి  శ్రీధర్ బాబు పరమార్శించి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ నువ్వు అధైర్య పడద్దని అండగా తాము ఉంటామని  ధైర్యం నింపాడు. సాగర్ తల్లిదండ్రులకు ఓదార్చి, త్వరలోనే మీ కుమారుడు ఆరోగ్యంగా కోలుకుంటాడని, సాగరకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.