calender_icon.png 15 October, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీకి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా పనిచేయడమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రధాన విధి

15-10-2025 12:23:05 AM

-జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామక ప్రక్రియలో కార్యకర్తల 

-అభిప్రాయ  కీలకమైనది ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు శ్రీనివాస్ మనె

కరీంనగర్, అక్టోబరు 14 (విజయ క్రాంతి) : పార్టీకి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా పనిచేయడమే  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ప్రధాన విధి అని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకంలో కార్యకర్తల అభిప్రాయం కీలకమైందని  ఏఐసీసీ పరిశీల కులు, కర్ణాటక హంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనె అన్నారు. మంగళవారం  డిసిసి కార్యాలయంలో టిపిసిసి ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ, చిట్ల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాన కొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దేశం మొత్తం లో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరవడిని సృష్టించిందని,  కిందిస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు జిల్లా కాంగ్రెస్  అధ్యక్షుని నామినేటెడ్ పద్ధతిన నియమించకుండా క్షేత్రస్థాయిలో బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు విభాగాల అధ్యక్షులు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టి ఎవరిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తే వారు ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేయగలుగుతారో,  అలాంటి వారిని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టిందన్నారు

ఈ నియామక ప్రక్రియ ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలలో విజయవంతమయిందని, ఆరో రాష్ట్రంగా తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 22 మంది ఏఐసీసీ పరిశీలకులు, పిసిసి పరిశీలకులతో రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియామక ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. అందులో భాగం గా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించామని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తూ ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత ఆ నివేదికను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో  పిసిసి కోఆర్డినేటర్ మ్యాడం బాలకృష్ణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమతు హుస్సేన్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు,  ఊట్కూరు నరేందర్ రెడ్డి, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, మడుపు మోహన్, పత్తి మధు, పురం రాజేశం, పత్తి కృష్ణారెడ్డి, ముస్తాక్, అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.