calender_icon.png 15 October, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక డిమాండ్ సీజన్

15-10-2025 12:25:11 AM

  1. అందిన కాడికి పోగు చేసుకుంటున్న ఇసుక వ్యాపారులు 
  2. ఫిల్టర్ ఇసుకకు భలే డిమాండ్ అదను చూసి అమ్ముతున్న ఇసుక వ్యాపారులు 
  3. అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు : నవాబ్ పేట ఎస్‌ఐ విక్రమ్

నవాబ్ పేట, అక్టోబర్ 14: ప్రస్తుతం ఇసుక డిమాండ్ సీజన్ గా కనిపిస్తుంది. అసలే ఇందిరమ్మ ఇండ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ఇండ్ల నిర్మాణం జరు గుతుంది. ఇదే అదునుగా చేసుకున్న ఇసుక వ్యాపారులు ఫిల్టర్ దందాకు తెర లేపారు. ఇక్కడ అక్కడ అనే భేదం లేకుండా ఇసుక వస్తుంది అంటే చాలు ట్రాక్టర్లను నింపి ప్రత్యేక బోర్ల ద్వారా కడిగేస్తుండ్రు. ఇది అధికారులకు తెలియక కాదు అనేది ప్రజలు చెబుతున్న మాట.

అదృష్టం బాగాలేక అటువైపు సంబంధిత అధికార యంత్రాం గం వెళుతున్న సమయంలో ఇసుక వ్యాపారు చేసే వ్యక్తులు తమ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న సమయంలో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తూ ఇకపై ఎవరైనా ఇసుక తరలింపులు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో నివారణ చర్యలు మాత్రం ముందు కు సాగడం లేదనే మాట వినిపిస్తుంది. మండల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా ఇసుక వ్యాపారం సాగుతుంది. 

 అక్రమంగా తరలిస్తే సీజ్...

నవాబుపేట మండలం హన్మసానిపల్లి   గ్రామ శివారులో వర్షానికి కొట్టుకు వచ్చిన ఇసుకను ట్రాక్టర్ లో నింపుకొని రుద్రారం గ్రామం నికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నందున  ట్రాక్టర్ నెంబర్ TS 06 UB 4532  ట్రాలీ TS 06UB6264 ట్రాక్టర్ పై మంగళవారం  కేసు నమోదు చేశారు. 

ప్రభుత్వమే ఇసుక ఇస్తే అక్రమ రవాణా జరగదు కదా..

 సమయం సందర్భం వచ్చినప్పుడు అల్లా అధికార యంత్రంతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా ఇసుక ఉచితంగా అందిస్తాం ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తాం అంటూ ప్రకటిస్తున్నప్పటికీ ఆశించిన మేరకు ఎక్కడ కూడా ఇసుక రవాణా జరగడం లేదు. కొన్ని ప్రాంతాలలో సంబంధిత రెవెన్యూ అధికార యంత్రాంగం అనుమతులు ఇచ్చినప్పటికీ  ఇందిరమ్మ ఇంట్లో నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మాత్రం ఇసుక చేరడం లేదని మాట వినిపిస్తుంది.

మరికొన్ని మండలాల లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణంలో ముఖ్య భాగమైన ఇసుకకు అత్యధికంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడింది. అసలే వర్షాకాలం ఆపై వాగులలో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి ఇసుక కావాలంటే ఇక మధ్యవర్తులని సంప్రదించ వలసిందే వారు చెప్పిన కాడికి అప్పజెప్పవలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రం ప్రత్యేక చర్యలు ఇప్పటి కైనా పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటు లోకి తెచ్చేందుకు అధికార యంత్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ప్రజలు చెబుతున్న మాట.

అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు

ఇసుక ఎలాంటి అనుమతి లేకుండా తరలించినట్లు గుర్తిస్తే వారిపై చట్టప్రకా రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకుని ఇసుకను తరలింపు చేయాలని అనుమ తి లేకుండా తరలించకూడదు. నిబంధ నలు పాటించకుంటే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ట్రాక్టర్లను మరి ఇతర వాహనాలనైనా సీజ్ చేయడం జరుగుతుంది.

 విక్రమ్, ఎస్‌ఐ, నవాబ్ పేట మండలం, మహబూబ్ నగర్ జిల్లా