calender_icon.png 11 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈదుర గాలులకు లేచిపోయిన రేకులు

11-10-2025 12:31:28 AM

నిరాశ్రయులైన పేద కుటుంబం

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని అప్పన్నపేట గ్రామంలో గురువారం రాత్రి వచ్చిన ఈదురు గాలులు కొద్దిసేపు బీభత్సం సృష్టించింది.విపరీతంగా గాలులు,వర్షం రావడంతో కొత్త అప్పన్నపేట గ్రామంలో కొంతమంది ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.కొమ్మరాజు లక్ష్మి ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోయాయి.గాల్లోకి లేచిన రేకులు దూరంగా ఖాళీ స్థలంలో పడడంతో ప్రమాదం తప్పింది. వీటితోపాటు లక్ష్మీ ఇంటిలో ఉన్న విలువైన సామాగ్రి  దెబ్బతిన్నాయి.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. బాధితురాలు కొమర్రాజు లక్ష్మి మాట్లాడుతూ ఈదురుగాలి తాకిడికి సుమారు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈదురు గాలులతో నష్టపోయిన లక్ష్మీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మాజీ వార్డు సభ్యులు మదారు కోరారు.