calender_icon.png 12 January, 2026 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.43 లక్షలతో అభివృద్ధి పనులు

10-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్, జనవరి 9 (విజయ క్రాంతి): ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బేగంపేట డివిజన్ పరిధిలోని కళాసిగూడ లో గల మినర్వ కాంప్లెక్స్ సమీపంలో 43 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, వాటర్ లైన్ ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, అమీర్ పేట సర్కిల్ డి సి సుజాత, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, ఆరీఫ్, శేఖర్, సాబెర్, భరత్, ఆకుల హరికృష్ణ, కె.కిషోర్, నార్ల దీపక్ తదితరులు ఉన్నారు.