calender_icon.png 12 January, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుండగులను వెంటనే పట్టుకోవాలి

10-01-2026 12:00:00 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి జనవరి 9 (విజయక్రాంతి): సెవెన్ హిల్స్ వెంకటేశ్వర దేవాలయము సందర్శించుకొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనంతరం గత రెండు రోజుల క్రితం కేపిహెచ్బి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి నగలు,వెండి ఆభరణాలు దొంగతనానికి పాల్పడిన సంఘటన తెలిసింది.ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రావు శుక్రవారం దేవాలయాన్ని సందర్శించి పరిశీలించడం జరిగిన విషయంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా డివిజ న్ అధ్యక్షులు కృష్ణారెడ్డి ని పలు వివరాలు అడిగి తెలుసుకుని దుండగులు ను పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారని, పోలీస్ అధికారులతో వెంటనే పట్టుకునే విధంగా చూడాలని సూచించానని తెలిపారు.ఎంతటి నిఘవ్యవస్థ ఉన్నా పక్కా ప్రణాళికతోనే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.