calender_icon.png 1 July, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు

01-07-2025 01:49:13 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, జూన్ 30 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 50 కోట్లు మంజూరయ్యాయని, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ 35వ వార్డు లో 13 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాహ్మణవాడలో భజన మందిరం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు.

ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని,తడి పొడి చెత్త వేరు చేయాల్సి అవసరం ఉందన్నారు.డంపింగ్ యార్డు తో డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడరాదన్నారు.ప్రజల సహాకారం ఉంటేనే పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.రామాలయం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానన్నారు.

జగిత్యాల పట్టణానికి ఏడాది కాలం లో రు.50 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయ ని,పట్టణానికి మరో 50 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,అడువల లక్ష్మణ్,బాలే శంకర్,బొలుసాని పద్మావతి శ్రీనివాస్, ఉమాభారతి తదితరులుపాల్గొన్నారు.