calender_icon.png 1 July, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు బడులకు దీటుగా సర్కార్ బడులు నిలవాలి

01-07-2025 01:47:38 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ 

మానకొండూర్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు నిలవాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రహరీగోడ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనకు వేగవంతమైన చర్యలు చేపట్టిందన్నారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. సౌకర్యాల కల్పనతోనే సరిపోదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగితేనో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఎదగగలుగుతామని ఆయన పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు పెంచడమే కాకుండా విద్యార్థుల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రేమిడి తిరుమల్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు రేమిడి శ్రీనివాస్ రెడ్డి,బి.మహేందర్, బుర్ర శ్రీధర్, మడుపు ప్రేమ్ కుమార్, వెంకటేష్, మీస సత్యనారాయణ, మాడ తిరుపతిరెడ్డి, మాతంగి సహదేవ్, సునిల్, వంగల మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుదర్శనంతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందిపాల్గొన్నారు.