01-07-2025 01:49:14 AM
పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
19 మంది మృతి
22 మందికి తీవ్రగాయాలు
* ఎప్పటిలాగే ఉదయం షిఫ్టులో ఫ్యాక్టరీ లోపలికి వెళ్లిన కార్మికులకు ఈరోజు తాము మృత్యుకుహరంలోకి వెళుతున్నామని తెలియదు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలి, ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. ఎగిసిపడిన మంటల్లో 19 మంది కార్మికులు బుగ్గిపాలయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 12 మంది మృత్యువుతో పోరాడుతున్నారు.
క్షతగాత్రుల హాహాకారాలు.. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతిల్లిపోయింది. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
పటాన్‌చెరు/సంగారెడ్డి, జూన్ 30 (విజయక్రాంతి) : పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కెమికల్ రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దం వచ్చింది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు చప్పుడు విని పించినట్లు స్థానికులు చెప్పారు. వంద మీటర్ల దూరం వరకు కార్మికులు ఎగిరిపడినట్లు సమాచారం.
ఉధృతంగా మంట లు చెలరేగడంతో కార్మికులు వాటిలో చిక్కుకుపోయారు. మంటలు, ఘాటైన పొగ వల్ల కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాదంలో 19 మంది కార్మికులు మృతిచెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీం, ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. గంటలకొద్దీ మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బం ది విశ్వప్రయత్నం చేశారు.
పేలుడు ధాటికి మూడంతస్థుల భవనం కుప్పకూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కొంతమంది కార్మికులు శిథిలాల కింద నలిగిపోయారు. ఎస్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, హైడ్రా బృందాలు శిథిలాల తొలగింపు చేపట్టాయి. శిథిలాల కింద ఎంతమంది కార్మికులు ఉన్నారో తెలియడం లేదు.
మిన్నంటిన రోదనలు.. ఆందోళన
ప్రమాదం జరిగినట్లు తెలియగానే పరిశ్రమలో విధులకు వచ్చిన వారి కుటుంబీ కులు పరిశ్రమ వద్దకు రోదిస్తూ వచ్చారు. కంపెనీలోని కార్మికుల ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో కార్మిక కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి ఫ్యాక్టరీ వద్దనే పడిగాపులు పడుతూ అక్కడ ఏర్పా టు చేసిన సెల్‌లో తమవారి పేర్లను రాసిచ్చారు. సాయంత్రం అవుతున్నా తమవారి ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి.
దీంతో పోలీ సులు వారిని అదుపు చేస్తూ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కుటుంబాల జాడ తెలియకుండా పోయిందని, వారు బతికి ఉన్నారా లేదా సమాచారం కూడా తెలియడం లేదని అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు నచ్చజెప్పి బాధితులను శాంతింపజే శారు.
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు..
మధ్యాహ్నం వరకు మంటలను ఆర్పివేసి శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ టీం విశ్వప్రయత్నం చేస్తోంది. గంటల తరబడి శ్రమిస్తున్నా ఇంకా శిథిలాలను తొలగించే పనిలోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యేకంగా జనరేటర్లను తీసుకొ చ్చి శిథిలాల తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో శిథిలాలను తొల గిస్తే తప్ప కార్మికుల జాడ తెలిసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
ఫోరెన్సిక్ నిపుణుల రాక..
భారీ విస్పోటనానికి రియాక్టరా లేదా హై ప్రెషర్ కారణమా అనే దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు కంపెనీలో జరిగిన పేలుడుపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ నిపుణులు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పేలుడుకు గల కారణాలను వెల్లడించనున్నారు. కొందరు నిపు ణులు చెబుతున్న దానిబట్టి డ్రయ్యర్ యూనిట్‌లో తీవ్ర ఒత్తిడి వల్ల పేలుడు జరిగివుంటుందని భావిస్తున్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం..
అగ్ని ప్రమాద బాధితులకు రక్షణ సహా య చర్యలు అందించడం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య తెలిపారు. ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోవడానికి వారికి తక్షణ సహాయ చర్యల కోసం 08455 276155 నెంబర్ తో కూడిన కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రికార్డులు దగ్ధం.. హెచ్‌ఆర్ మేనేజర్ మృతి
సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో ఉదయం షిఫ్ట్‌కు వచ్చిన కార్మికుల వివరాలతో కూడిన రిజిస్టర్‌తో పాటు కంప్యూటర్లు ప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ప్రమాదంలో విధులకు ఎంతమంది కార్మికులు వచ్చారు.. ఎవరెవరు హాజరయ్యారు అనే వివరాలు తెలియకుండా పోయాయి. అలాగే కార్మికుల వివరాలను నమోదు చేసుకునే మేనేజర్ సైతం ఈ ప్రమా దంలో మృతి చెందడంతో కార్మికుల వివరాలు తెలియడం కష్టంగా మారింది.
ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి
సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ప్రధా నమంత్రి జాతీయ సహాయ నిధి కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. నేడు ఘటనాస్థలికి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమా దంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పాశమైలారంలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ప్రమాద బాధితులకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను అక్కడున్న మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్‌ను అడిగి సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
సహాయక చర్యలపై సీఎస్, డీజీపీతోనూ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రమా దంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభు త్వం తరపున ఒక కమిటీ ఏర్పాటు చేశా రు. సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్ట్‌మెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యల ను సిఫారసు చేసే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు.
పాశమైలారం ఘటన విచారకరం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తీవ్ర విచా రం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణా లు కోల్పోయిన కార్మికులకు సంతాపం ప్రకటించారు. మృతులు కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.
తీవ్ర దిగ్బ్రాంతికరం
పాశమైలారంలోని పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ప్రమాద కారణాలపై విచారణ జరిపించాలి. ప్రమాదంలో గాయపడిన వారికి తక్ష ణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.
కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి
ప్రగాఢ సానుభూతి
పాశమైలారం ప్రమాద ఘటన దురదృష్టకరం. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేస్తున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దు.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
కార్మికులను రక్షించాలి
పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది కార్మికులు మృతిచెందడం దురదృష్టకరం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలి.
వె కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్