29-07-2024 02:34:47 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ అఫైర్స్ (ఎన్‌ఆర్‌ఐ సెల్) సమన్వయకర్తగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నంగి దేవేందర్‌రెడ్డిని నియమించారు. పీసీసీ తరఫున విదేశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేయనున్నట్టు దేవేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఏజెంట్ల చేతిలో మోసపోయిన అనేక మందికి గల్ఫ్‌లో సాయం చేసి తిరిగి వారు స్వదేశానికి వచ్చేలా కృషి చేసినట్టు ఆయన వెల్లడించారు. తనకు పీసీసీ తరఫున అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్తగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్‌కుమార్‌కు దేవేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.