15-11-2025 09:59:45 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం, పొలంపల్లి గ్రామ శివారులోని కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి వద్ద తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళి అర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజా విప్లవానికి చేయూతనిచ్చి ప్రజలకు అనుకూలంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు కేవల్ కిషన్. ముదిరాజు ముద్దుబిడ్డ కేవల్ కిషన్ అని అన్నారు. కెవల్ కిషన్ ప్రశ్నించడం నేర్పించడం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. బ్రతికి ఉన్నన్ని రోజులు నాకు ప్రజలే ముఖ్యమని అన్న కేవల్ కిషన్, కిషన్ వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ బాటలు వేసేందుకు మేము కూడా ఉంటామని అన్నారు. వీరితోపాటు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.