15-11-2025 10:00:08 PM
బంగారం, వెండి, నగదు, వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డిసిపి కర్ణాకర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పోలీసులమని చెప్పి ఒక ఇంటిలో దోపిడీ చేసిన నలుగురు దొంగలను, వారి వద్ద నుండి బంగారం, వెండి ఆభరణాలతో పాటు పదివేల రూపాయల నగదు, వాహనాలను స్వాధీన పరుచుకొని, ఆ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగిందని పెద్దపల్లి డిసిపి కరుణాకర్ తెలిపారు. శనివారం రాత్రి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను డిసిపి వెల్లడించారు.
డిసిపి కర్ణాకర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 10 న సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సంకరి లక్ష్మి ఇంటికి తెల్లవారుజామున పోయి తాము కరీంనగర్ వన్ టౌన్ పోలీసుల మంటూ వారిని బెదిరించి ఇంట్లో ఉన్న వారితో మాట్లాడారు. మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి అన్న సమాచారం మేరకు మేం కరీంనగర్ నుండి రావడం జరిగిందని, ఇంట్లో ఉన్న లక్ష్మి కుమారుడికి బేడీలు వేశారు. తర్వాత ఇంట్లో ఉన్న దాదాపు 15 లక్షల రూపాయల విలువగల బంగారం ఆభరణాలు, కొన్ని వెండి ఆభరణాలు, పదివేల రూపాయలు నగదు తీసుకున్నారు. మీరు రేప్పొద్దున కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి అక్కడ మాట్లాడాలని చెప్పి వారిని నమ్మించారు.
వారికి అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించగా వచ్చిన వారు పోలీసులు కాదు దొంగలని తెలిసింది, ఈ మేరకు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేశారు, ఈ దొంగతనం చేసిన నలుగురు దొంగలు శనివారం బంగారం అమ్మడానికి కరీంనగర్ కు వాహనంలో వెళ్తుండగా కాట్నపల్లి వద్ద అనుమానం వచ్చి సోదా చేయగా వారి నుండి బంగారం ఆభరణాలు, వెండి ఆభరణాలు , నగదు తో పాటు ఒకటి జైలో... ఒకటి వ్యాగానర్, ఒకటి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం వారి నుండి స్వాధీన పరచుకోవడం జరిగిందని డీసీపీ కరుణాకర్ తెలిపారు,
దొంగల వివరాలు..
సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన నాగుల కుమారస్వామి , కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన తిప్పరి రవీందర్ , సుల్తానాబాద్ శాస్త్రి నగర్ కు చెందిన పురుషోత్తమ నాగరాజు, కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ పోవారి శ్యామ్ రావు లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు డిసిపి కర్ణాకర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డిసిపి వెంట ఏసిపి జి.కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రావణ్ కుమార్, సనత్ రెడ్డి , వెంకటేష్ లు ఉన్నారు.
సీఐ, ఎస్ఐలను అభినందించిన డిసిపి కరుణాకర్
ఎంతో చాక చక్యంగా నలుగురు దొంగలను పట్టుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్, జూలపల్లి ఎస్సై సనత్ రెడ్డి , కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ తో పాటు పలువురు పోలీసుల ను డిసిపి కర్ణాకర్ అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.