calender_icon.png 15 November, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి చేలల్లోని 13 మంది బాలలకు వెట్టి నుండి విముక్తి.!

15-11-2025 09:43:41 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పాఠశాలకు వెళ్లకుండా పత్తి చేలకు తరలింపబడుతున్న 13 మంది చిన్నారులను తాడూరు మండల పోలీసులు, కోనెరు ఎన్జీవో బృందం కలిసి శనివారం వెట్టి నుండి విముక్తి కల్పించారు. నాగర్ కర్నూల్–కల్వకుర్తి రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ పిల్లలను గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ ఏ.సురేష్ కుమార్ మాట్లాడుతూ... సాతాపూర్, ఏదుల, కొండ్రావుపల్లి, చంద్రకల్ గ్రామాల నుంచి మేడిపూర్, యద్వతాపూర్, ఐతోల్, ఇంద్రకల్, యాదిరెడ్డిపల్లి ప్రాంతాలకు పత్తి తరలించేందుకు తీసుకెళుతున్న వాహనాలను ఆపి చిన్నారులను కౌన్సిలింగ్ చేసినట్లు తెలిపారు.

అనంతరం వారి తల్లిదండ్రులకు ముందు కౌన్సిలింగ్ నిర్వహియించి అప్పగించారు. ఇకపై పిల్లలను పత్తి చేలకి తరలించినట్లయితే వాహన డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులకు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకే పంపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కేతావత్ ముకేష్, కోనెరు ఎన్జీవో కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఏరియా కోఆర్డినేటర్ జాకీర్ హుస్సేన్, శ్రీనివాస్ యాదవ్, కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ కల్పన తదితరులు పాల్గొన్నారు