calender_icon.png 15 November, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనాలు వెంటనే చెల్లించాలి

15-11-2025 09:54:29 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్(NHM) పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీల రెండు నెలల వేతనాలు, అలాగే 7 నెలల పి ఆర్ సి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఏ.ఐ.టి యు.సి నాయకత్వం లో ఉద్యోగులు డిమాండ్ చేశారు. వేతనాల ఆలస్యంపై అసంతృప్తితో, నవంబర్ 17 నుండి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు వారు అధికారికంగా సమ్మె నోటీసు జారీ చేశారు.

అశ్వాపురం మండల ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ సంకీర్తనకు శనివారం సమ్మె పత్రం అందజేసిన ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలు మాట్లాడుతూ... గత కొంతకాలంగా ఎన్ హెచ్ యం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల విడుదలలో తీవ్రమైన ఆలస్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు జమ అవుతున్నప్పటికీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించకపోవడం తీవ్ర వివక్షతకే నిదర్శనమని పేర్కొన్నారు.

వేతనాల జాప్యం కారణంగా ఈయంఐలు పెండింగ్‌కు వెళ్లడం, చెక్కులు బౌన్స్ కావడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోవడం వంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల జీతాలు ఇంతవరకు అందలేదని పేర్కొంటూ, ప్రతి నెల 1వ తేదీన గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 7 నెలల పీఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని,

ఈనెల 10వ తేదీ వరకు వేతనాలు జమ కానిపక్షంలో నవంబర్ 17 నుంచే నిరవధిక సమ్మె ప్రారంభించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నోటీసును అధికారిక సమ్మె నోటీసుగానే పరిగణించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం ,యం ఎల్ హెచ్ పి లు ఇందిర, భిక్షమమ్మ, నాగమణి, శారద, రాజేశ్వరీ, దేవి, రాజ్యలక్ష్మి, భవాని, రాములమ్మ, శైలజ, వెంకటనరసమ్మ, స్వర్ణ, వెంకమ్మ, ప్రియా, మౌన్య, పూర్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు.