calender_icon.png 15 November, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

15-11-2025 09:45:25 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం నాడు గిరిజనుల ఆరాధ్య దైవం, ఆదివాసుల ఆత్మగౌరవ ప్రతీక, జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా బిర్సా ముండా జయంతిని ఎమ్మార్వో మణిధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, బిర్సా ముండా 1875 నవంబర్‌ 15న జార్ఖండ్‌లోని ఉలిహాట్ గ్రామంలో జన్మించారు.

1894లో ఆగ్లేయుల దోపిడీ, అన్యాయ పాలనకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమానికి నాంది పలికారు. తన అనుచరులతో కలిసి బ్రిటిష్ దౌర్జన్యానికి ఎదురుదెబ్బ ఇచ్చి, వారి ఆస్తులను కొల్లగొట్టి సింహస్వప్నంగా నిలిచాడు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన మహానేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.