15-11-2025 09:48:36 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి శిల్పి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముందుగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ, “ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి పునాది వేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. తనదైన అనుభవం, శైలి, క్రమశిక్షణతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.