calender_icon.png 24 January, 2026 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో పడి భక్తుడి మృతి

03-10-2024 02:03:33 AM

నిర్మల్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి బుధవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపా రు. ఏపీలోని ఒంగోలుకు చెందిన  ఆదారత్(45) కుటుంబ సభ్యులతో బాసరకు వచ్చారు. మొదటి పుష్కర ఘాట్ వద్ద స్నానం చేసేందుకు మెట్లు దిగుతుడంగా కాలుజారి నదిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

గమనించిన కొందరు ఆదారత్‌ను నీటి నుంచి బయటకు తీసుకువచ్చా రు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. కాగా లోకేశ్వరం మండలం గడ్‌చాంద వాసి ముత్యం (47) బుధవారం కాలకృత్యాలను తీర్చుకోవడా నికి చెరువు వద్దకు వెళ్లగా అదుపు తప్పి నీటిలో పడి మృతి చెందాడు.