24-01-2026 01:03:03 AM
తోపులాట..
జనగామ, జనవరి 23 (విజయక్రాంతి): మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జనగామ పర్యటనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వా దం నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండగా ఉద్రిక్త వాతావరణం నెలకొ ంది. బైపాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్ శిల్పాలు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ను కొబ్బరి కాయ కొట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలిచారు.
ఇది బీఆర్‌ఎస్ కార్యక్రమం కాదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తనయుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి.. ఎమ్మెల్యే పల్లాతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నాడని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, ప్రతాప్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది.
అలాగే బస్టాండ్ చౌరస్తా జంక్షన్ వద్ద సూర్య నమస్కారాల శిల్పాలను ఆవిష్కరించే సమయంలోనూ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బతుకమ్మ కుంటలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను, ఆర్ అండ్ బి బంగ్లాను, వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు.