calender_icon.png 24 January, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చుక్క నీటిని వదులుకోం

24-01-2026 12:47:13 AM

కృష్ణ, గోదావరి జలాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధం

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్

  1. వ్యవసాయం ఒక విజ్ఞానం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  2. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
  3. హాజరైన మంత్రులు తుమ్మల, అడ్లూరి 

హుజూర్‌నగర్/మఠంపల్లి, జనవరి 23: కృష్ణ, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని, కృష్ణ, గోదావరి జ లాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమని నీటిపారుదల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మం డలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వా మిని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ దంపతులతో కలిసి మంత్రి ఉత్తమ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఆవరణ లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శించారు.

లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం హు జూర్‌నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కోదాడ సమీపంలో జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్‌కు, డార్మెటరీ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్, కోదాడ ప్రజల జీవి తాల్లో వెలుగు  నింపడమే తన లక్ష్యమన్నా రు.

ఏ రాష్ట్రంలో పండించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని పండిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 85శాతం మందికి  ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. మట్టపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. హుజూర్‌నగర్ నుంచి మట్టపల్లి వరకు రూ.80 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేశామని, గతంలో 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మించామని మంత్రి చెప్పారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడు తూ.. రానున్న రోజుల్లో ఐటీ, ఏఐ కన్నా వ్యవసాయ రంగమే ముందుంటుందన్నారు. సాఫ్ట్‌వేర్, ఐటీ సెక్టార్‌ల నుంచి వచ్చి వ్యవసాయ రంగంలో పనిచేసే రోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ దేశానికే వరి అందించే ఏకైక రాష్ట్రంగా మారిందని, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి జిల్లాలలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వ్యవసాయ కళాశాలలు మం జూరు చేసినట్టు తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముందు ఉందని, రాబో యే రోజుల్లో పామాయిల్ పంటలో దేశం లో ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. 

వ్యవసాయం.. విజ్ఞానం: గవర్నర్

గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడుతూ.. వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వా మిని దర్శించుకోవడం సంతోషకరన్నారు. ‘వ్యవసాయం ఒక విజ్ఞానమని‘ ఇంతకు పూ ర్వం దేశంలో జై జవాన్, జై కిసాన్, నినాదం ఉండేదని, ఆ తర్వాత జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్  నినాదం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇది జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్‌గా మారిందని తెలిపారు.

గంగ, యమునా, సరస్వతి లాగే కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండటం, మట్టపల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం చేయడం, ప్రత్యేకించి పామాయిల్ పెంపకం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ రైతులకు రూ.2.47 కోట్ల వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్‌ను అందజేశారు.

అంతేకాక స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 504 కోట్లు, ఆదాయ వనరులను పెంపొందించేందుకు మరో 89 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ కుందూర్ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూర్ జయవీర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్, ఈఓ జ్యోతి పాల్గొన్నారు.