24-01-2026 01:33:55 AM
న్యూఢిల్లీ, జనవరి 21: భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు, మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టాటా మోటార్స్ 17 ట్రక్కుల తదుపరి తరం పోర్ట్‌ఫోలియోను ప్రారంభించింది. భారతీయ ట్రక్కింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి తీసుకున్న ఒక మైలురాయిగా పేర్కొంది. ఇది భద్రత, లాభాలు, పురోగతిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని వెల్లడించింది. సరికొత్త అజురా సిరీస్ గా పేర్కొన్న ఈ అత్యాధునిక టాటా ట్రక్స్ ఈవీ శ్రేణిని మరియు ఇప్పటికే నిలదొక్కుకున్న ప్రిమా, సిగ్నా, అల్ట్రా ప్లాట్‌ఫామ్‌లకు గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుందని తెలిపింది. కఠినమైన ప్రపంచ భద్రతా ప్రమాణాలకుఅనుగుణంగా రూపొందించబడిన ఈ ట్రక్కులు, సంపాదన సామర్థ్యాన్ని పెంచుతాయని టాటా మోటార్స్ వెల్లడిచింది, మొత్తం యాజమాన్య వ్యయాన్ని తగ్గించడంతో పాటు రవాణాదారులకు ఎక్కువ విజయాన్ని అందించడానికి వాహనాలు నడిచే సమయాన్ని పెంచుతాయి.
కాగా భారతదేశం ట్రక్కింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందనీ టాటా మోటార్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ శ్రీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, సురక్షితమైన, మరింత సమర్థవంతమైన లాజిస్టిక్స్ కోసం పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణమన్నారు. పరిశ్రమ భవిష్యత్తును రూపొందించే ప్రమాణాలను నిర్దేశించడంలో టాటా మోటార్స్ ఎల్లప్పుడూ ముందుందనీ, తమ తదుపరి తరం పోర్ట్‌ఫోలియో పరిచయంతో - సరికొత్త అజురా సిరీస్, రెండు అధునాతన అధిక-సామర్థ్య పవర్‌ట్రెయిన్‌లు, ఈవీ ఆర్కిటెక్చర్‌లో కీలకం కానున్నాయన్నారు. నెక్స్ట్-జెన్ కనెక్ట్ చేయబడిన వెహికల్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లీట్ ఎడ్జ్ ద్వారా రియల్-టైమ్ డ్రైవింగ్ బిహేవి యర్ మానిటరింగ్ భద్రతను మరింత పెంచుతుందని తెలిపారు. టాటా మోటార్స్ తన ట్రక్కులను ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రమాణానికి పెంచిన ఏకైక భారతీయ తయారీదారుగా నిలిచిందన్నారు.