24-01-2026 12:51:52 AM
గడువుకల్లా నిధులు ఖర్చు చేయని హెచ్‌ఎంలపై చర్యలు
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): పీఎంశ్రీ(పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండి యా) నిధులు మురిగిపోనున్నాయి. ఈ పథకం కింద ఆయా పాఠశాలలకు విడుదలైన నిధులు వెన క్కి వెళ్లనున్నాయి. నిర్ధిష్ట గడువు కల్లా మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లనున్నాయి. రాష్ట్రం లోని 832 బడు లు పీఎంశ్రీ పథకానికి గతంలో ఎం పికయ్యా యి. అయితే 33 జిల్లాలకు ఈ పథకం కింద రూ.60.68 కోట్లు గతే డాది నవంబర్‌లో విడుదలయ్యాయి.
ఒక్కో స్కూల్‌కు రూ.6లక్షల నుంచి రూ.8 లక్షల వరకు, ఒక్కో జిల్లాకు రూ.కోటి నుంచి రూ.3 కోట్లకుపైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను స్పోర్టస్ మీట్, గెరీర్ గైడెన్స్, మ్యాథ్స్ సర్కిల్, సైన్స్ సర్కిల్, ఆర్ట్స్ క్రాఫ్ట్స్ మెటీరియల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్కూల్ లీడర్ షిప్స్, స్కూల్ ఆన్వల్ గ్రాంట్, వొకేసనల్ రా మెటీరియల్, చైల్డ్ సేఫ్టీ, మాక్‌పార్లమెంట్, ఇండస్ట్రీయల్ విజిట్ లాంటి 26 కార్యక్రమాల కోసం ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వినియోగించాల్సి ఉంటుంది. ఈ జనవరి 24 నాటికి ఈ మొత్తం నిధులను పాఠశాలలు ఖర్చు చేయాలి.
అయితే ఈ నిధులను హెచ్‌ఎంలు మొత్తం ఖర్చు చేయలేకపోయారు. మొత్తం విడుదలైన రూ.60.68 కోట్లలో రూ.10.62 లక్షల వరకు మాత్రమే ఖర్చు అయినట్లు తెలిసింది. అంటే ఇంకా రూ.50 కోట్లు నిధులు మిగిలిపోయాయి. దీంతో ఆ నిధులను ఎందుకు ఖర్చు చేయలేదో పీ ఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంల నుంచి వివరాలను విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎంత ఖర్చు చేశారు? ఎందుకు చేయలేకపోయారో వివరణ అడగనుండటంతో హెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చుకు సమయమేదీ?
గతేడాది నవంబర్, డిసెంబర్‌లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల విధుల్లో చాలా మంది ఉపాధ్యాయులున్నారు. సంక్రాంతి సెలవులు కూడా వచ్చాయి. దీంతో నిధుల ఖర్చుకు సమయమేదని పలువురు హె చ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఖర్చు చేయని హెచ్‌ఎంలపై అధికారులు చర్యలుంటాయని హెచ్చరిస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ నిధులను వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలన్నా ఒక్కో దానికి మూడేసి అనుమతులు అధికారుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా పది రకాల డాక్యుమెంట్లు జతపరచాలి. ఇతర బడి పనులు చేసుకుంటూ ఇదంతా చేయాలంటే కనీసం వంద రోజులు సమయం పడుతుందని హెచ్‌ఎంలు చెప్తున్నారు. ఇంత తక్కువ సమ యం లోపల ఖర్చుపెట్టాలి లేదంటే డబ్బులు సరెండర్ చేయాలని, హెచ్‌ఎంలపై చర్యలు కూడా ఉంటాయని చెప్పడం సరైంది కాదంటున్నారు.
ఇంత తక్కువ సమయంలో వివిధ కార్యక్రమాల కోసం వస్తువులు సేకరించడం, నిపుణులతో గెస్ట్ లెక్చర్ ఇప్పించడం, క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లడం సాధ్యం కాని పని అని పలువులు హెచ్‌ఎంలు తమ అభిప్రాయం వ్య క్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే హెచ్‌ఎంలు నిధుల లెక్కల ఖర్చును తేల్చేందుకు కుస్తీపడుతున్నారు.