calender_icon.png 24 January, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ఆర్ నిధులు ఎలా ఖర్చుచేశారు?

24-01-2026 01:28:24 AM

సైట్ విజిట్ మతలబేమిటి.. 

  1. నైనీ బొగ్గు టెండర్లపై టెక్నికల్ కమిటీ విచారణ ప్రారంభం
  2. ఒక్కో అంశం వారీగా ఫైళ్ల పరిశీలన
  3. జీఎం కార్యాలయాల నుంచి ఫైళ్లు తెప్పిస్తున్న సింగరేణి అధికారులు
  4. అవసరమైతే.. నేడు కొత్తగూడెం కార్యాలయం సందర్శన

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి) : సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వెనుక భారీ స్కాం ఉందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. ఈనెల 21న కమిటీని నియమిస్తూ కేంద్ర బొగ్గు శాఖా మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆదేశాలతో.. బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జన రల్ చేతనా శుక్లా, టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా విచారణకు నియమించిన టెక్నికల్ కమిటీ 22న మధ్యాహ్నానికల్లా హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయానికి చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో నైనీ బొగ్గు టెండర్లకు సంబంధించిన ఒక్కో అంశం వారీగా ఫైళ్లను పరిశీలించారు. అలాగే అనుమానం వచ్చిన ప్రతి అంశంపై సింగరేణి అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నట్టు సమాచారం.

సైట్ విజిట్‌పై లోతుగా..

ఇదిలా ఉండగా.. నైనీ బొగ్గు టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేసి సింగరేణి జనరల్ మేనేజర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధనపై తీవ్ర దుమారం రేగింది. దీనితో ఈ అంశంపై టెక్నికల్ కమిటీ లోతుగా సింగరేణి అధికారులతో చర్చించినట్టు తెలుస్తున్నది. టెండర్లలో సైట్ విజిట్ చేయాలనే నిబంధనను ఎలా పెట్టారు అనే ప్రశ్నకు.. కేంద్రం 2018లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే సైట్ విజిట్ నిబంధనను పెట్టినట్టు సింగరేణి అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.

ఇందుకు సాక్ష్యంగా 2018లో విడుదల చేసిన మార్గదర్శకాలను.. అలాగే 2021 సెప్టెంబర్‌లో ఆర్‌జీ ఓసీ-3 మైన్‌లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ని ర్మాణానికి సంబంధించి డిజైన్, సప్లు, ఎరక్షన్, కమిషనింగ్ అండ్ టెస్టింగ్‌కు జారీచేసిన టెండ ర్ డాక్యుమెంట్‌లో ఈ సైట్ విజిట్ అంశాన్నికూడా పొందుపర్చినట్టుగా ఆధారాలు చూ పించారు. ఈ టెండర్ డాక్యుమెంట్‌ను రాంచీ (జార్ఖండ్) లోని సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లి. తయారు చేసింది.

ఈ ప్రక్రియ మొత్తం కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే సిద్ధం చేశారని.. అలాగే.. నైనీ బొగ్గు బ్లాక్ మైన్ డెవపలర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) టెండర్‌నుకూడా సిద్ధం చేసినట్టుగా అధికారు లు వివరించారు. గురువారం నుంచి వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించిన టెక్నికల్ కమిటీ.. ఎక్కువ సమయాన్ని ఈ సైట్ విజిట్ అనే నిబంధనపైనే విచారించినట్టు సమాచారం.

సీఎస్‌ఆర్ నిధుల ఖర్చు వివరాలేవీ..

నైనీ టెండర్‌తోపాటు.. సీఎస్‌ఆర్ నిధుల ఖ ర్చులపైకూడా లోతుగా విచారించాలని కేం ద్రం ఉత్తర్వుల నేపథ్యంలో.. శుక్రవారం నాడు ఈ అంశంపైకూడా టెక్నికల్ కమిటీ సింగరేణి అధికారుల నుంచి సమాచారాన్ని రాబట్టే ప్ర యత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయా జీఎంల స్థాయిలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని.. ఒక్కో ఏరియావారీగా, క్షేత్రస్థాయిలో ఖర్చుచేసిన సీఎ స్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల వివరాలను.. ఒక్కో పని వారీగా, ఎక్కడెక్కడ ఏయే పని చేపట్టారు.. ఎంత ఖర్చు చేశారు.. ఎవరు ఆయా పనులను చేశారు అనే పూర్తిస్థాయి సమాచారాన్ని టెక్నికల్ కమిటీ అడిగినట్టు తెలుస్తుంది.

దీనితో కొంత సమయం ఇస్తే.. వెంటనే ఆయా ప్రాంతాల వారీగా జనరల్ మేనేజర్ల నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అందిస్తామని సింగరేణి అధికారులు టెక్నికల్ విచారణ కమిటీని రిక్వెస్ చేసినట్టు తెలుస్తుంది. వెంటనే తాము కోరిన సమాచారాన్ని మొత్తం తెప్పించాలని చెప్పడంతో సింగరేణి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

అవసరమైతే కొత్తగూడెం కార్యాలయం సందర్శన..

ఇదిలా ఉండగా.. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని సందర్శిం చి ఒక్కో అంశాల వారీగా సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలించిన కేంద్ర టెక్నికల్ కమిటీ బృందం.. అవసరమైతే సింగరేణి ప్రధా న కార్యాలయం ఉన్న కొత్తగూడెంకు కూడా వెళ్ళాలనే ఆలోచనను వ్యక్తంచేసినట్టు తెలుస్తుంది. తాము కోరిన సమాచారానికి సం బం ధించిన ఫైళ్లు ఇక్కడ లభించకపోతే.. ప్రధాన కార్యాలయం ఉండే కొత్తగూడెంకు వెళ్ళాలనే ఆలోచనలో టెక్నికల్ కమిటీ ఉన్నట్టు సింగరేణి అధికారులు భావిస్తున్నారు.

కొత్తగూడెం వెళ్ళేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అయితే సీఎస్‌ఆర్ నిధుల ఖర్చు విష యంలో పూర్తిసమాచారం అందించిన తరువాత.. అవసరమైతే క్షేత్రస్థాయిలో రాండమ్‌గా ఒకట్రెండు చోట్ల ఆయా పనులను కూడా పరిశీలించే అ వకాశం ఉన్నట్టు అధికారులుకూడా అనుకుంటున్నారు. అందులో భాగంగానే కొ త్తగూడెం సందర్శనఆలోచన ఉండవచ్చని తెలుస్తుంది.

మొత్తానికి నైనీ బొగ్గు బ్లాక్ టెండ ర్ విషయంలో రోజురోజుకూ ముదురుతున్న వివా దం నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎంత వేగంగా స్పందించి టెక్నికల్ విచారణ కమిటీని ఏర్పాటుచేశారో.. అంతే వేగంగా కమిటీ కూడా స్పందించింది. ఈనెల 21 నాడు కమిటీ ఏర్పాటుచేస్తూ.. ఉత్తర్వులు జారీకాగా.. అవికాస్తా 22న ఉదయానికల్లా సింగరేణి సీఎండీకి అందాయి. మధ్యాహ్నానికల్లా కమిటీ  స భ్యులు హైదరాబాద్‌లో కాలు పెట్టడం గమనార్హం.

ఉత్తర్వుల్లోనే.. ఏయే అంశాలను లోతు గా పరిశీలించాలనేదికూడా స్పష్టంగా పేర్కొనడంతో.. అదే స్థాయిలో టెక్నికల్ విచారణ బృందంకూడా కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. ఒక్కో అంశం వారీగా సమాచారా న్ని తెలుసుకుంటూ.. అందుకు సంబంధిం చిన రికార్డులు, ఫైళ్లు, నిబంధనలు, మార్గదర్శకాలకు సంబందించిన కాపీలనుకూడా చూసిన ట్టు తెలుస్తుంది. శనివారం ఒక్కరోజు మాత్ర మే ఉంది.. వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి ఢిల్లీకి వెళ్లి నివేదికను బొగ్గు మంత్రి త్వ శాఖకు అందించే అవకాశం ఉంది.