28-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ,జనవరి 27 ( విజయక్రాంతి):మేడారం శ్రీ సమ్మక్క ,సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గం గణపురం, రేగొండ,చిట్యాల మండల కేంద్రాలల్లో మేడారం వెళ్ళే బస్సు పాయింట్ లను పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్, ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పరకాల డిపో నుండి మొత్తం 160 బస్సు సర్వీసులు మేడారం శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు.
జాతరకు వెళ్ళే భక్తులు ఆర్టీసీ సేవలు తప్పక సద్వినియోగం చేసుకోవాల న్నారు. పరకాల డిపో నుండి గణపురం, రేగొండ, చిట్యాల బస్సు పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామ్మాని, మేడారం వెళ్లే భక్తులకు మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. టేకుమట్ల మండల కేంద్రం నుండి కూడా బస్సు సర్వీసులు మేడారం కు నడిచేలా చూడాలని ఎమ్మెల్యే డీఎం కు సూచించారు.