01-07-2025 02:50:38 AM
- సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్ నగర్, జూన్ 30 (విజయ క్రాంతి): ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సనత్ నగర్ ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం అమ్మవారి కల్యాణం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఆయ న అధికారులతో కలిసి ఆలయ పరిసరాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. గతం లో అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల నిర్వహించే వారని, చాలా మంది భక్తులకు కళ్యాణం చూసే అవకాశం ఉండేది కాదని పేర్కొన్నారు. అమ్మవారి కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు. అనేకమంది దాతలు అల్పాహారం, భోజనం అందిస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు.
ఆల యం వద్దకు రాలేకపోయిన భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని ప్రసార మాధ్యమాల ద్వా రా ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాట్లు చేసి న విషయాన్ని గుర్తు చేశారు. కళ్యాణానికి ఒక్క ఇంకా ఒక్క రోజే ఉన్నా ఇంకా కళ్యాణం టికెట్‌లు, వలంటీర్‌ల పాస్‌లు, మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వలేదని, వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించే రధోత్సవం ఘనం గా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఎమ్మె ల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఓ మహేందర్ గౌడ్, అన్నపూర్ణ, సూపరింటెండెంట్ హైమావతి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్‌రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్‌రెడ్డి, నామన సంతోష్ కు మార్, కరుణాకర్‌రెడ్డి, సురేష్‌గౌడ్, కూతురు నర్సింహ, రాజేష్, బలరాం, శేఖర్, గోపిలాల్ చౌహన్, భూపాల్‌రెడ్డి, రాజు ఉన్నారు.