27-12-2025 04:12:46 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం శివన్నగూడ, కొండూరు గ్రామాలలో పశు వైద్య వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులను శనివారం పంపిణీ చేశారు. శివన్నగూడలో సర్పంచి రాపోలు యాదగిరి ప్రారంభం చేశారు. 1339 గొర్రెలు, 409 మేకలకు, అదేవిధంగా కొండూరు గ్రామంలో 1221 గొర్రెలు, 492 మేకలకు నట్టలు నివారణ మందులను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాపోలు యాదగిరి మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యగా అధికారులు అందజేస్తున్న మందులను సద్వినియోగo చేసుకోవాలని సూచించారు.