calender_icon.png 27 December, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2017 డ్రగ్స్ కేసు.. ఆధారాలు ఏమయ్యాయి?

27-12-2025 04:15:16 PM

డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది?

హైదరాబాద్: అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ప్రశ్నించారు. నాటి డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. కేసీఆర్ కుటుంబసభ్యులూ డ్రగ్స్ తీసుకున్నారని కొందరు వాంగ్మూలం ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. నిందితుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియోలు రికార్డు చేశారని చెప్పారు. నాటి డ్రగ్స్ కేసును కేసీఆర్ ప్రభుత్వం(KCR government) నీరు కార్చిందని ఆయన ఆరోపించారు.  అకున్ సబర్వాల్(Akun Sabharwal)ను డ్రగ్స్ కేసు విచారణ నుంచి తప్పించారని బండి సంజయ్ ఆరోపించారు. అకున్ సేకరించిన ఆధారాలను నాటి సీఎస్ సోమేశ్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తక్షణమే సోమేశ్ కుమార్ ను విచారించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈగల్ బృందంలో కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అకున్ సబర్వాల్ కు డ్రగ్స్ కేసు విచారణ బాధ్యత తిరిగి అప్పగించాలని సంజయ్ కోరారు.