calender_icon.png 23 May, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ పోలీస్ అధికారులను ప్రశంసించిన డీజీపీ

22-05-2025 01:08:08 AM

- ప్రశంసలు అందుకున్న సీఐలు, ఎస్‌ఐలను అభినందించిన జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం 

 మహబూబ్ నగర్ మే 21 (విజయ క్రాంతి) : విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన ఇద్దరు సిఐ లను,  ఎస్‌ఐలను రాష్ట్ర డిజి పి జితేందర్ ప్రత్యేకంగా ప్ర శంస పత్రాలు అందించి అభినందించారు. 

60 రోజు లలో ఫోక్సో కేసుల నందు ఎక్కువ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి నందుకుగాను మహబూబ్ నగర్ రూరల్ సీఐ బానోతు గాంధీ నాయక్  రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చినది, జిల్లా అధికారి ఉత్తర్వుల మేరకు అవుట్ స్టాండింగ్ కేసుల డిటెక్షన్ చేసిన విషయంలో జడ్చర్ల రూరల్ సీఐ టి.నాగార్జున గౌడ్ కి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం లభించింది.

యుఐ కేసుల పరిష్కారం నందు ఎక్కువ మొత్తంలో పరిష్కరించినందుకు గాను మహబాబూబ్ నగర్ రూరల్ ఎస్త్స్ర విజయ్ కుమార్ కి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం జరిగింది. సి.ఈ.ఐ.ఆర్  క్యూ.ఆర్ కోడ్ వినియోగంలో రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన నవాబ్ పేట ఎస్త్స్ర విక్రమ్ కి రా ష్ట్ర స్థాయిలో ఐదవ స్థానం వచ్చినది. అధికారులకు ప్రశంస పత్రాలు రాష్ట్ర బీజేపీ నుంచి తీసుకోవడంతో జిల్లా ఉన్నత అధికారులు అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజే శారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ డి.జానకి మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖకు ఇది గర్వకా రణమైన ఘట్టమని,జిల్లాకు చెందిన నలుగురు పోలీసు అధికారులు తమ కృషి, నిష్ట, సమర్ధతతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వారు ప్రతి కేసును సమగ్రంగా పరిశీలిస్తూ, బాధితులకు న్యాయం అందించడంలో ముందుండి పని చేయడం వల్లే ఈ గౌరవం లభించిందన్నారు.