22-05-2025 01:06:50 AM
మహబూబాబాద్, మే 21 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణం ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చెట్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి వరకు రోడ్డుపై పచ్చటి వేప చెట్లు నీడనిస్తూ ప్రజలకు వేసవిలో కాస్త ఉపశమనాన్ని ఇస్తుండగా, ఒక్క రోజులోనే చెట్లను యంత్రాల సహాయంతో కొట్టేయడంతో నీడ తొలగిపోవడంతో ఎండకు ప్రజలు అల్లాడుతున్నారు.
ఏళ్ల క్రితం నీడనిచ్చేందుకు తమ ఇండ్ల ముందు కొందరు మొక్కలు నాటి వృక్షాలుగా పెంచడానికి కష్టపడగా, రోడ్డు వెడల్పుతో ఆ చెట్లన్నీ తొలగిస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసిన తర్వాత మొక్కలు నాటితే చెట్లు ఎప్పుడు పెరిగేదని, అప్పటివరకు ఎలా అంటూ వాపోతున్నారు.