11-10-2025 06:21:27 PM
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల
కాటారం,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన ధాన్య కృషి యోజన పథకం రైతులకు మేలు చేకూరుస్తుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల-సమ్మయ్య అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ను శనివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాని మోది ప్రారంభం చేయగా, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల-సమ్మయ్య హాజరయ్యారు. ఏఎంసీ డైరెక్టర్ పిల్లమారి రమేష్, కాటారం రైతులు పాల్గొన్నారు. ఈ పథకం కింద అధునాతన పంటలను రైతులు పండించాలని, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య పంటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక లాభాలు ఆర్జించాలని వివరించారు.