11-10-2025 06:19:42 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను, కరోన విపత్కర సమయంలో చేసిన సేవలను గుర్తించి శనివారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ లో మాక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ డైరెక్టర్ చెరిపెళ్లి దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా అవార్డ్స్-2025 కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్, నల్ల బాబు, న్యూస్ రిపోర్టర్ రజిని నాయుడు, వేముల స్వాతి చేతుల మీదుగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ కి జాతీయ ఉత్తమ నంది అవార్డు, ప్రశంస పత్రం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ కరోన విపత్కర సమయంలో చేసిన సేవలను గత 21 సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెరిపెళ్లి దినేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.