calender_icon.png 22 July, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై రైలు పేలుళ్లు.. ఆ 12 మంది నిర్దోషులే

22-07-2025 12:15:34 AM

బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ముంబై, జూలై 21: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ముంబైలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2006లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శిక్ష పడిన 12 మందిని తాజాగా నిర్దోషులుగా ప్రకటించిం ది. వారిపై ఉన్న అభియోగాలను నిర్థారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్టు తీర్పు వెలువరించింది.

వీరిలో ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా ఉండటం గమనార్హం. 2006 జూలై 11న పశ్చిమ రైల్వేలైన్‌లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 800 మందికి పైగా గాయపడ్డారు. కాగా ముంబై పేలుళ్ల తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముం బై పేలుళ్ల కేసులో తాజాగా నిర్దోషులుగా తేలిన 12 మంది ఏ నేరం చే యనప్పటికీ దాదాపు 18 ఏళ్ల జైల్లో మగ్గడం దారుణమన్నారు. ఈ సమయంలో వారు చాలా జీవితాన్ని కో ల్పోయారన్నారు. ఘటన జరిగిన 19 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు బాధి త కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. మహారాష్ట్ర యాంటిఈ టె ర్రరిజం స్కాడ్‌పై ప్రభుత్వం ఎలాం టి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు.