09-01-2026 12:30:37 AM
తుంగతుర్తి, జనవరి 8: తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు గురువారం 24వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 24వ రోజు 24వ పాశురాన్ని అర్చకులు కాటూరి రామాచార్యులు పఠించారు.
మహిళలు మంగళ హారతులతో ప్రదర్శనగా వచ్చి కుంకుమార్చన, అభిషేకాలు వంటి పూజలు నిర్వహిం చారు. అనంతరం మహిళలు భక్తి పాటలు ఆలపించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.