09-01-2026 12:29:34 AM
కోదాడ జనవరి 8: మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నల్లపాటి సిద్దు శేఖర్ శ్రావణి దంపతుల కుమారుడు నిర్వాన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాతలకుగా వ్యవహరిస్తూ అన్నదాన కార్యక్ర మాన్ని ప్రారంభించారు.
భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు సేవించారు. అనంతరం దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు మాట్లాడుతూ దేవాలయంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మాకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఈదర నరసింహారావు, ఈదర వెంకటేశ్వర్లు, ఆదినారా యణ, సత్యనారాయణ, వీరభద్రం (పటేల్), అర్చకులు సాయి శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.