calender_icon.png 1 May, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే నెలలో అంగన్వాడి సెంటర్లకు సెలవులు ఇవ్వాలని ధర్నా

25-04-2025 01:52:57 AM

మేడ్చల్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): మే నెలలో అంగన్వాడి సెంటర్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి సునీత, బి. శోభారాణి మాట్లాడుతూ ఎండలు పెరిగినందున గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సెంటర్ లకు రావడంలేదని, సెంటర్లలో కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు.

కర్ణాటక రాష్ట్రం సెలవులు ప్రకటించినందున మన రాష్ట్రంలో కూడా ప్రకటించాలన్నారు. అనంతరం బి డబ్ల్యు ఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు ఉన్నికృష్ణన్, అంగన్వాడి టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.