calender_icon.png 25 May, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యసాయి సంస్థ సేవలు అద్భుతం

24-05-2025 10:31:13 PM

ఎంతో మంది పిల్లలకు జీవితాన్ని ఇవ్వడం అజరామం..

పుల్లెల గోపి చంద్..

కొండపాక: ఏమి ఆశించకుండా సత్యసాయి సంస్థలు అందిస్తున్న సేవలు ఎంతో అద్భుతమైనవని ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్(Indian badminton chief national coach Pullela Gopichand) అన్నారు. కొండపాక ఆనందనిలయం శివారులోని సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసర్చ్ ను శనివారం సందర్శించారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో ఈనెల 13 నుంచి 23 వరకు నాలుగవ సెషన్లో 25 చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపి చంద్ గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లల తల్లితండ్రులతో మాట్లాడి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంత అభాగ్యులకు సైతం సత్యసాయి సేవలు అందడం అదృష్టం అన్నారు. ఇదంతా దైవం చేపిస్తున్నట్టుగా కనబడుతుందని పేర్కొన్నారు. ఈ భగవత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, సేవా తత్పరతను పెంపొందించుకోవాలని తెలిపారు.

తమ పిల్లల గుండెకు చిత్రం పడిందని తెలవగానే విలవిలలాడిన తల్లిదండ్రులకు చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతం కావడంతో వారి కళ్ళలో కనబడుతున్న ఆనందం చెప్పరానిదని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కొందరు మోక్షం కోసం, వారిస్వార్థం కోసం సేవలు అందిస్తారు. కానీ సత్యసాయి వారు నిస్వార్థంగా అందిస్తూ తమపిల్లలుగా చూసి మరో జీవితాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం తల్లితండ్రుల ఆనందం కోసం మరో జీవితాన్ని అందిస్తున్న ఆసుపత్రి నిర్వాహకుల డాక్టర్లు సిబ్బంది సేవలు అద్భుతమన్నారు.

జీవితంలో పవిత్రమైన పర్వదినం

పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 108 మంది పిల్లలకు ఆపరేషన్ లు పూర్తి చేసి విజయవంతమైనరోజు జీవితంలో పవిత్రమైన పర్వదినమైన రోజని సత్యసాయి సంజీవని హర్ట్ సెంటర్ లో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఇది సేవా మందిరమని ఇప్పటివరకు 108 మంది పిల్లలకు జీవనదానం పొందారని పేర్కొన్నారు.ఇదంతా దేవుని ఆశీర్వాదమని దైవ ప్రేమను బిడ్డ గుండెలోకి పెట్టామన్నారు.వీరంతా భవిషత్ లో సమాజానికి సేవ అందించేది సమయం చెప్తుందన్నారు. కార్యక్రమంలో వరదరాజన్ కృష్ణన్,ఆపరేషన్ చేసుకున్న పిల్లల తల్లి తండ్రులు వారి అనుభవాలు పంచుకున్నారు.