24-05-2025 10:44:49 PM
షి టీం ఎస్సై రమాదేవి
ములకలపల్లి (విజయక్రాంతి): ములకలపల్లి కేజీబీవీ పాఠశాలలో శనివారం జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమంలో సైబర్ నేరాల గురించి షి టీం రమాదేవి(She Team SI Ramadevi), స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్ పాల్గొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రమాదేవి మాట్లాడుతూ... తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి క్రెడిట్ కార్డు నెంబరు సి వి వి అడుగుతూ మోసం చేస్తారని, ఐటి డిపార్టుమెంటు నుండి ఫోన్ చేస్తున్నామని డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి మన దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బు కొల్ల గొడుతున్నారని అటువంటి వారి ఉచ్చులో పడకూడదని, ఏమైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షి టీం ఎస్ ఐ కొత్తగూడెం బ్రాంచ్ స్థానిక ఎస్సై రాజశేఖర్, ఎంఈఓ సత్యనారాయణ, ఆర్పీలు, సిఆర్పిలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.