calender_icon.png 7 July, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధురంధర్.. గ్యాంగ్‌స్టర్ డ్రామా

07-07-2025 12:49:28 AM

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న తాజాచిత్రం ‘ధురంధర్’.  ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత అయిన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఉరి: ది సర్జికల్ స్ట్రుక్’ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా కావటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆదివారం రణ్‌వీర్ సింగ్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను ఫస్ట్‌లుక్ పేరుతో విడుదల చేశారు. రణ్‌వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఇంకా సంజయ్‌దత్, అక్షయ్‌ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.