calender_icon.png 7 July, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్!

07-07-2025 12:51:04 AM

అమెరికా వేదికగా నిర్వహించిన ‘నాట్స్ 2025’ కార్యక్రమంలో తెలుగు సినీతారలు సందడి చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, నటుడు అల్లు అర్జున్, నటి శ్రీలీల పాల్గొని, అమెరికాలో ఉంటున్న తెలుగువారిని ఉద్దేశించి మాట్లాడా రు. ముఖ్యంగా ఈ వేదికపై అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టుల్‌లో డైలాగ్ చెప్పి అందరిలో ఉత్సాహం నింపారు. ‘తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్’ అంటూ తనదైన శైలిలో మాట్లాడాడు బన్నీ.

“ఈ కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొన్నా నాకు ఆశ్చర్యం గా ఉంటుంది. ఇంతమంది తెలుగు వారిని చూస్తుం టే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్టే ఉంది. మనమంతా ఇలా అమెరికాలో కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నాట్స్ గురించి సరదాగా ‘పుష్ప’ స్టుల్‌లో చెప్పాలంటే ‘నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’. మన తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే” అన్నారు అల్లు అర్జున్. “ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానం. ఈ సందర్భంగా నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్‌కు, నాకు మధ్య ఒక పోలిక ఉంది. అదే గడ్డం (నవ్వులు). నేను ‘అడవి రాముడు’లో అడవిని నమ్ముకున్నా.. స్టార్ డైరెక్టర్ అయ్యా.

నువ్వు (సుకుమార్‌ను ఉద్దేశించి) ‘పుష్ప’లో అడవిని నమ్ముకున్నావు.. స్టార్ డైరెక్టర్ అయ్యావు. బన్నీని స్టార్ హీరోని చేశావు” అని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ.. “అమెరికాలోని తెలుగువారందరికీ నేనెంతో రుణపడి ఉన్నా. ముఖ్యంగా రెండు విషయాల్లో కృతజ్ఞతలు చెప్పాలి. ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని మీరందరూ ఇక్కడ ఆదరించడం వల్ల నాకు వేరే సినిమా అవకాశం వచ్చింది. అది నా కెరీర్‌కు ఎంతో ప్లస్ అయింది” అని తెలిపారు.