07-07-2025 12:48:27 AM
సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయు డు (ఎస్‌కేఎన్) స్పందించారు. సోమవారం ఎస్‌కే ఎన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడు తూ సినీపరిశ్రమలో తన కెరీర్ గురించిన విషయాలను పంచుకున్నారు. ఇదే సందర్భంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్ని పలు సమస్యలపై మాట్లాడారు. “ఇండస్ట్రీలో పారితోషికాలు భారీగా పెంచేస్తున్నారు.
సిని మా బడ్జెట్లు పెంచేస్తున్నారు. అవసరం లేకపోయినా పెంచేస్తున్న నటీనటుల రెమ్యు నరేషన్స్ తగ్గించాలి. నిర్మాతలు వెళ్లి హీరోల ను ఒప్పించాలి. ఇక సినిమా బడ్జెట్ పెరిగిందని చెప్తూ.. టికెట్ ధరలు పెంచుతు న్నారు. ఒకర్ని చూసి ఇంకొకరు అదే మార్గంలో నడుస్తున్నారు. వీళ్లే టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులను సినిమాలకు రాకుండా చేసేస్తున్నారు. తక్కువ టికెట్ రేటు ఉంటే కనీసం సరదాగానైనా ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు.
మీరు సినిమా బడ్జెట్లు పెంచుకొని థియేటర్‌కు జనం రావడంలేదని, వచ్చిన వాళ్ల దగ్గర నుంచి వసూ లు చేద్దాం అనుకుంటే మీకే నష్టం. వాళ్లు కూడా రావడం మానేస్తారు. ఇక ఓటీటీలోకి మూడు, నాలుగు వారాల్లో సిని మా వస్తుంటే అంత టికెట్ రేటు పెట్టి థియేటర్‌కు ఎందుకు వస్తారు.
ఆ డబ్బులు దాచు కోవడం మంచిది అనుకుంటున్నారు. ఒక పెద్ద సినిమాకు ఎక్కువ టికెట్ రేటు పెట్టి ప్రేక్షకులు వచ్చినా ఇంకో మూడు నాలుగు నెలలు మళ్లీ థియేటర్‌కు రావడంలేదు. దీం తో ఆ తర్వాత వచ్చే స్మాల్, మీడియం రేంజ్ సినిమాలకు ఎఫెక్ట్ అవుతోంది. ఇదే కొనసాగితే నాని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. ‘పోతారు మొత్తం పోతారు.. నిర్మాతలు అం తా పోతారు” అన్నారు ఎస్‌కేఎన్.