07-07-2025 12:52:44 AM
పవన్‌కల్యాణ్ నటించిన తాజాచిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఒకవైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా వివాదంలో ఇరుక్కుంది. మొదట్నుంచీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రబృందం... ఎట్టకేలకు తమ సినిమా విడుదలకు నోచుకుంటోందని సంతోషిస్తున్న సమయంలో అనూహ్యంగా మరో అడ్డంకి ఎదురైంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది.
తర్వాత కోవిడ్, పవన్ రాజకీయాల్లో బిజీగా మారటం వంటి పరిస్థితుల్లో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ఇదే క్రమంలో అనివార్య కారణాలతో క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇలా దాదాపు ఐదేళ్ల పాటు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ నిర్మా ణం పూర్తయిన ఈ సినిమాను జూలై 24న విడుదల చేస్తామని టీమ్ ప్రకటించింది.
అయితే, ఈ చిత్రానికి ఇప్పుడు బీసీ సం ఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అభ్యంతరాలు మరింత ఎక్కువయ్యాయి. తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి, ఇష్టానుసారం కల్పిత కథగా మార్చారని బీసీ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. పవన్ పోషించిన సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు హరిహర వీరమల్లు పాత్ర ఊహజనితమైనదని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియజేసిం ది.
అయితే ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించేటప్పుడు కల్పిత పాత్ర ను సృష్టించడమనేది బహుజనులు, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆ సామా జిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినోదం, డబ్బుల కోసం బహు జన నాయకుడి చరిత్రను తప్పుదోవ పట్టించేలా సినిమా తీస్తే ఊరుకోమని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శివ ముదిరాజ్ సహా పలువురు ఈ ఆందోళనకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు. పవన్‌కల్యాణ్ పూటకో మాట మార్చి పండు గ సాయన్న జీవిత చరిత్రను తమకు ఇష్టం వచ్చినట్టుగా కల్పిత కథలు అల్లుతూ సినిమా తీస్తే, ఆయనపై ఉన్న గౌరవం పోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఇది పండుగ సాయన్న జీవిత చరిత్రే
ఈ విషయమై కొందరు బీసీ సంఘ నాయకులతో కలిసి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ లో మీడియాతో శివ ముదిరాజ్ మాట్లాడా రు. “పవన్‌కల్యాణ తీస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా మా తెలంగాణ బందూక్, తెలంగాణ రాబిన్‌హుడ్, ప్రజావీడు పండుగ సాయన్న జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని రూపొందించారు. చరిత్రను తప్పుదోవ పట్టించమే కాదు.. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇది పండుగ సాయ న్న స్టోరీ కాదు..
1336లో విజయనగర సామ్రాజ్యంలో జరిగిన స్టోరీ అని చెప్తున్నా రు. 1410 నాటికే సాలువ వంశం అంతమైం ది. స్థాపించిన హరిహర రాయలు, బుక్కరాయల కాలానికి, ఔరంగజేబు కాలానికి 6 వందల ఏళ్ల తేడా ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యోధుడు పండుగ సాయన్న చరిత్రనే ఇలా సినిమా తీస్తున్నారు. ఇంత అవగాహన లేకుండా సినిమా తీయడమేంటి.
కాబట్టి దీన్ని ఈ సినిమాను అడ్డు కుంటాం.దీనిమీద న్యాయ పోరాటం చేస్తాం. హైకోర్టులో పిల్ వేస్తాం. వీలైతే పవన్‌కల్యాణ్‌ను కలుస్తాం. పవన్‌కల్యాణ్ మాకు శత్రు వు కాదు. ఆయన తీసిన ఏ సినిమానూ ఇప్పటివరకు అడ్డుకోలేదు.మా గొడవ ఆయనతో కాదు. ఆయన తీసిన సినిమాతోనే. ఆయన కూడా చిత్రబృందానికి చెప్పాల్సిన అవసరం ఉంది” అన్నారు శివ ముదిరాజ్.