25-07-2025 01:25:59 AM
ఖమ్మం, జూలై 24 (విజయ క్రాంతి):నిర్దిష్ట గడువులోగా డైట్ కళాశాల భవన నిర్మాణ, ఆధునికీకరణ అదనపు సదుపాయాల పనులు పూర్తి చేయాలని విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యో గితా రాణా సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా విద్యా శాఖ సంచాలకులు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ లతో కలిసి గురువారం ఖమ్మం డైట్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణ, ఆధునీకరణ అదనపు సదుపాయాల పనులను పరిశీలించారు.విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మాట్లాడుతూ డైట్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణ పనులు, ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని, ప్రస్తుతం చేసే పనులు చాలా కాలం వరకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు.
డైట్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణం, ఆధునీకరణ పనుల పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు.పనులలో నాణ్యతను పరిశీలించిన తర్వాతే పూర్తి స్థాయి బిల్లు పేమెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించేలా సిద్ధం చేయాలని అన్నారు.
డైట్ కళాశాల పనులను అదనపు కలెక్టర్ రెగ్యులర్ గా మానిటర్ చేయాలని విద్యా శాఖ కార్యదర్శి సూచించారు.ప్లాస్టరింగ్ పనులు ప్రాధాన్యతతో పూర్తి చేయాలని అ న్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రాజీవ్, ఆర్.జె.డి. సత్యనారాయణ రెడ్డి, జెడిఎస్ మదన్ మోహన్, సమగ్ర శిక్ష జెడి వెంకట నర్సమ్మ, కెజిబివి రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ హెచ్. హరీష్, మోడల్ స్కూల్స్ రాష్ట్ర ఏ.ఎం.ఓ. బిడిఆర్‌ఎస్ మంజరి,సి.ఎస్.ఎఫ్. అసోసియేట్ డైరెక్టర్ జి.సురేష్, పి - జామ్ కో ఫౌండర్ ప్రాంజలి పాఠక్, స్టేట్ జిసిడిఓ. శిరీష, ఈడబ్ల్యుఐడిసి షఫీమియా, జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, సీఎంఓ రాజశేఖర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.