25-07-2025 01:23:46 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ర్టంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాల కు వెళ్లి, ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని ఆదేశించారు.
ఈ మేరకు సంగారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి.. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ప్రివెంటివ్ మెజర్స్‌పైన దృష్టి సారించాలని సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆ యా ప్రాంతాల్లో అవేర్‌నెస్ క్యాంపులు, మె డికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
ఓపీ టైమింగ్స్ పెంచుకోవాలి
ప్రభుత్వ హాస్పిటళ్లలో అవసరమైతే ఓపీ టైమింగ్స్‌ను పొడిగించుకోవాలని మంత్రి ఆదేశించారు. అన్నిరకాల మెడిసిన్స్, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్స్, టెస్టింగ్ కిట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకొని పేషెంట్లకు అవసరమైన అన్ని టెస్టులు హాస్పిటల్స్‌లోనే చేయాలన్నారు. వార్డులు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోయినా, పేషెంట్ల ఆహారంలో నాణ్యత లోపించినా హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రైవేటు దోపిడీపై నిఘా
ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెట్టి డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రయ త్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మం త్రి ఆదేశించారు. బిల్లులు అధికంగా వేసే హాస్పిటళ్లపై దృష్టి సారించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
గర్భిణులు ప్రత్యేకం..
అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని సూచించారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు, జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మంత్రి ఆదేశాలతో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిష నర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు జిల్లాల్లో పర్యటించనున్నారు.