25-07-2025 01:28:01 AM
చర్ల, జూలై 24 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాజయ్య నగర్ లో బుధవారం రాత్రి ఓ వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది. రాజయ్యనగర్ క్రాంతిపురం కు చెం దిన మడకం భద్రయ్య ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు.
రక్తపు మడుగులో పడి ఉన్న భద్రయ్య(34)ను భార్య లక్ష్మి కుటుంబ సభ్యులు చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో డాక్టర్ సాయి వర్ధన్ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు,మార్గం మధ్యలోనే తీవ్రత రక్తస్రావం తో భద్రయ్య మృతి చెందాడు. అంతర్గత కారణాలతోనే దుండగులు భద్రయ్య పై హత్యాయత్నం చేశారని తెలుస్తుంది.