ఆసియాపైనే అధిక ప్రభావం

26-04-2024 12:05:00 AM

వాతావరణ మార్పులతో విభిన్న పరిస్థితులు

2023లో వరదలు, తుపాన్లు, వడగాలులతో  ప్రాణ, ఆస్తి నష్టం

జెనీవా (స్విట్జర్లాండ్), ఏప్రిల్ 25: గతేదాడి వాతావరణ మార్పులు, నీటి సంబంధ విపత్తులతో ఆసియా అత్యంత తీవ్రంగా ప్ర భావితమైందని ప్రపంచ వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసి యావ్యాప్తంగా 2023లో వరదలు, తుపాన్ల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరిగిందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియాలోనే ఉష్ణోగ్రత పెరుగుదల సగటు అధికంగా ఉందని తెలిపింది. 1961 సగటు కంటే దాదాపు 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని గుర్తించింది. 

వరదలు, తుపాన్లే విపత్తులకు కారణం

ఆసియాలోని చాలా దేశాలు 2023లో వైవిధ్యమైన వాతావరణాన్ని చూశాయని డబ్ల్యూఎంఓ చీఫ్ సెలెస్ట్ సౌలో తెలిపారు. హీట్‌వేవ్స్, కరువులు, వరదలు, తుపాన్లు సంభవించాయని పేర్కొన్నారు. మొత్తం 79 నీటి సంబంధ విపత్తులు వచ్చాయని ఆమె తెలియజేశారు. ఈ విపత్తుల్లో 80 శాతం వరకు వరదలు, తుపాన్లు కారణంగా కాగా 2 వేలకుపైగా మరణాలు సంభవించాయి. హిమాలయాలు, హిందూకుష్ పర్వతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పడగా.. చైనా నైరుతి భాగంలో తీవ్ర కరువు సంభవించింది. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఆసియాలోని మంచు కొండలు వేగంగా కరిగిపోతున్నాయని గుర్తించింది. పశ్చిమ సైబీరియా నుంచి మధ్య ఆసియా వరకు, తూర్పు చైనా నుంచి జపాన్ వరకు వేసవిలో అధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.    

తక్షణ చర్యలు అవసరం

ప్రకృతి విపత్తుల్లో నష్టాన్ని నివారించేందుకు ఆసియా దేశాల్లోని జాతీయ వాతావ రణ సేవలు తక్షమే మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూఎంఓ సూచించింది.