3 July, 2026 | 1:10 AM

జోగులాంబ ఆలయంలో ఘనంగా శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ఠ

03-07-2026 12:00 AM

అలంపూర్, జూలై 2: అలంపూర్ అమ్మవారి ఆలయంలో గురువారం శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వంద మందికి పైగా వేదపండితుల వేదఘోషల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో  చేతుల మీదుగా శ్రీచక్ర యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ , దేవస్థానం ఈఓ దీప్తి, ఎపిటోమ్ ప్రాజెకట్స్ ఎండీ జైపాల్ కాంత, శ్రీవిద్య దంపతులు, వేదపండితులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగడం భక్తులకు ఎంతో శుభప్రదమని, దీనివల్ల ఆలయంలో ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెరిగి భక్తులకు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని అన్నారు.

అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ, శ్రీచక్రారాధన ద్వారా మనోనిగ్రహం, ఏకాగ్రత, ఆత్మీయ ప్రశాంతత లభిస్తాయని తెలిపారు. శాక్తేయ సంప్రదాయంలో ‘యంత్రరాజం‘గా పరిగణించే శ్రీచక్రం ప్రతిష్ఠతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం అవుతుందని వేదపండితులు పేర్కొన్నారు.