22-05-2025 01:28:47 AM
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత్‌లో ఉగ్రమూకల చర్యలకు ఊతంగా వున్న పాకిస్థాన్ ధోరణిని ప్రపంచ దేశాలకు వివరించాల ని మోదీ ప్రభుత్వం తలపెట్టింది. అఖలపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏంపీల బృందాలు వివిధ దేశాల్లో పర్యటించనున్నాయి. బుధవారం ఇం దులో రెండు బృందాల పర్యటన మొదలైంది. పహల్గాంలో ఉగ్రవాదులు ఆమాయకులైన టూరిస్టులు 26 మందిని పొట్టనపెట్టుకోవడం, దానికి ప్రతిగా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం పాకిస్థాన్‌లో ఎంపిక చేసుకున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది.
పాకిస్థాన్‌తో గతంలో జరిగిన సింధూ జలాల ఒప్పందం రద్దు మొదలు వాణిజ్యం, ఇతర అంశాలపై భారత్ అన్ని విధాలుగా ఆ దేశంతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నది. ‘ఆపరేషన్ సిందూర్’ మింగుడు పడని పాకిస్థాన్ ఏకంగా భారత సరిహద్దుల రాష్ట్రాల్లోని మిలిటరీ స్థావరాలను, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడింది.
తమ దగ్గరున్న అణ్వాయుధాలతోనూ భారత్‌పై దాడి చేస్తామని కూడా పాకిస్థాన్‌లోని కొందరు రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలికా రు. ఉగ్రవాదులకు తావుగా వున్న పాకిస్థాన్, కశ్మీర్ సమస్యను బూచిగా చూపి ఉగ్రసంస్థలను భారత్ భూభాగంలోకి ప్రయోగించడం కొత్తేమి కా దు. కాని దృఢ సంకల్పంతో భారత్, పాకిస్థాన్‌కు ఈసారి బుద్ధిచెప్పిన తీరు ను ప్రపంచ దేశాలు మౌనంగానే ఆమోదించాయని చెప్పవచ్చు. రెండు దే శాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, అది యుద్ధంగా పరిణమించకూడదనే పలు దేశాలు హితవు పలికాయి.
ఈ సందర్భంలో ప్రపంచ దేశాలకు ఉగ్రదాడులపై భారత్ వైఖరి ఎలా వుండబోతున్నది, పాక్ ప్రదర్శిస్తున్న వైఖరి ఏమిటనేది వివరించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఉగ్రతండాలను భారత్‌లో దాడులకు ఉసిగొల్పడం, భారత్ ప్రతిగా దాడులు చేస్తే అ ణ్వాముధాలను బూచి చూపడం ఇకపై చెల్లదనేది భారత్ స్పష్టం చేస్తున్నది. అణ్వాయుధాలను చూపి బ్లాక్‌మెయిల్ చేసే ధోరణి విడనాడకపోతే పాకిస్థాన్ సైన్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది భారత్ ఈ సందర్భంలో ప్రపంచ దేశాలకు స్పష్టం చేయనున్నది.
సింధూ జలాలు పాకిస్థాన్‌కు వెళ్లకుంగా కట్టడి చేయాలన్న నిర్ణయంలోనూ మార్పు ఉండదని ప్రపంచ దేశాలకు స్పష్టంగా చెప్పాలని భారత విదేశాంగ కార్యదర్శి వి క్రం మిస్రీ తాజాగా ఎంపీల ప్రతినిధి బృందానికి దిశానిర్దేశం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్యం నెరపిందా? అందుకు అవును అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం పూర్వపక్షం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పష్టమైన ప్రకటనను అశిస్తున్నది.
తమ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను ఎంపీల బృందంలో కేంద్ర ప్రభుత్వం చేర్చుకోవడం.. తమ అభిమతాన్ని కాదని రాజకీయం చేయడమేనని అ పార్టీ బీజేపీపై గుర్రుగా వుంది. ప్రపంచ దేశాల్లో ఈ ఏంపీల బృందం పర్యటించి ఏం సాధిస్తుందని పెదవి విరుస్తున్న పార్టీలూ ఉన్నాయి. ప్రతినిధి బృం దంలో ఎంపీలు ఎవరనేది, ఆయా పార్టీల ప్రాతినిథ్యం అడగాలని.. కేంద్ర మే ఎలా పేర్లు ప్రకటిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత ఆమె మెత్తబడ్డారు.