calender_icon.png 23 May, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నార్థకంగా పత్రికా స్వేచ్ఛ!

22-05-2025 01:23:05 AM

వాస్తవానికి పాత్రికేయులు, సంపాదకులపై దాడులు బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయి. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రికలో సంపాదకీయం రాసినందుకే గాడి చర్ల హరిసర్వోత్తమరావుపై తెల్లదొరలు ఆయనపై రాజద్రోహ కేసును బనాయించారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించనప్పుడు కూడా సంపాదకులు, జర్నలిస్టులపై నిర్బంధం కొనసాగింది. కొందరి సంపాదకులు ఇళ్లపె దాడులు కూడా జరిగాయి. 

భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశంలో పత్రికలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందుకే.. శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ తర్వాత మీడియానే నాలుగో స్తంభం (ఫోర్త్ ఎస్టేట్) అని అంటాం. అంటే.. మీడియా రంగం ఎంత క్రియాశీలకంగా పనిచేస్తే దేశ ప్రజలకు అంత మేలు జరుగుతుందనేది పెద్దల మాట. కింది మూడు వ్యవస్థలు కట్టుతప్పుతున్నప్పుడు, గీత దాటుతున్నప్పుడు..

వాటిని గడిలో పెట్టడమే ఈ నాలుగో స్తంభం పని. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమేం కాదు. భారతదేశంలో ఇప్పుడు విలేకరులు, పాత్రికేయు లు, సంపాదకులకు నిజంగా స్వేచ్ఛ ఉందా..? అంటే  లేదనే చెప్పాలి. అందుకు కారణం మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులపై దాడులు, వారి హత్యలు, వారిపై కేసులే అని వేరే చెప్పనక్కర్లేదు. ‘భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్రమైన విఘాతం కలుగుతున్నది.

మీడియా క్రియాశీలక పాత్ర పోషించకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి’  అని ‘ది ఇండియన్ విమెన్స్ ప్రెస్ కోర్స్’, ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా’ రెండేళ్ల క్రితం ఘోషించాయి. పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం నానాటికీ దిగజారిపోతున్నది.

పత్రికా స్వేచ్ఛ సూచిక భారత్ మొత్తం 180 దేశాల్లో 151వ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. గతేడాదితో పోలిస్తే ఈసారి ర్యాంక్ ఎనిమిది స్థానాలు (159ర్యాంకు) తగ్గినప్పటికీ.. అదేమీ పెద్ద విషయం కాదని, అంతమాత్రాన మీడియా ప్రతినిధులకు  జరిగే మేలేమీ లేదనే అభిప్రాయం ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.

ఆందోళనకరంగా ఏపీలో పరిణామాలు..

పౌర స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలో భారత్ వెనుక నుంచి ముందంజలో ఉందంటే అతిశయోక్తి కాదు. అది పచ్చినిజం. దశాబ్ద కాలంగా భారత దేశంలో ఏం జరుగుతుందనేది పరిశీలిస్తే.. మనం పత్రికా స్వేచ్ఛ సూచికలో ఎందుకు వెనకున్నాం..అనే విషయం అవగతమవుతుంది. ప్రస్తుత కాలంలో పౌర స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనేవి పుస్తకాల్లో రాసుకునే మాటలే తప్ప, వాస్తవానికి అవెక్కడా లేవనే అభిప్రాయం మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై మీడియా వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

సాక్షి సంపాదకుడు ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండానే తనిఖీలు చేయడంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పరిణామాలపై ఏపీ చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల సంఘం ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు స్పందిస్తూ.. ‘ముం దస్తు సమాచారం ఇవ్వకుండా, సరైన వారెంట్ లేకుండా ఒకరి ఇంట్లో సోదాలు చేయడం పౌర హక్కులను హరించడమే.

తమకు నచ్చిన వారికి ఒక రకమైన న్యాయం. నచ్చని వారికి ఒక రకమైన న్యాయం అమలులో ఉండటమేంటి?’ అంటూ అక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏ దేశంలో వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. వారెంట్ లేకుండా పోలీస్ బలగాలతో సోదాలు చేయించడం సరికాదనే అభిప్రాయం పాత్రికేయుల నుంచి వ్యక్తమవుతున్నది. 

దశాబ్దం నుంచే ఏకంగా హత్యలే..

వాస్తవానికి పాత్రికేయులు, సంపాదకులపై దాడులు బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయి. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రికలో సంపాదకీయం రాసినందుకే గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై తెల్లదొరలు రాజద్రోహ కేసును బనాయించారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించనప్పుడు కూడా సంపాదకులు, జర్నలిస్టు లపై నిర్బంధం కొనసాగింది.

కొందరి సంపాదకులు ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. దశాబ్ద కాలం నుంచి పాత్రికేయు లు, సంపాదకులపై దాడులు, ఇంట్లో సోదాలు కాదు.. ఏకంగా వారి హత్యలే జరుగుతున్నాయి. కొన్ని మూఢవిశ్వాసాలకు అంధులైన దుండగులు ఆ దారుణాలకు పాల్పడుతున్నారు.

2013లో మహారాష్ట్రకు చెందిన రచయిత, కాలమిస్ట్ నరేంద్ర అచ్యుత దభోల్కర్‌ను, 2015లో కన్నడ సాహితీవేత్త కుల్బుర్గి, 2017లో సామాజికవేత్త, కాలమిస్ట్, సీపీఐ నేత గోవింద్ పన్సార్‌ను దుండగులు కాల్చిచంపారు.

అలాగే తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కర్ణాటకలో స్వతంత్రంగా పత్రిక నడుపుతున్న గౌరీలంకేశ్‌ను అదే ఏడాది దుండగులు పొట్టనపెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ.. అణచివేతలతో పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఒక ప్రజాస్వామిక దేశానికి అంత మంచిదికాదు. 

భిన్నాభిప్రాయాలను ఆహ్వానించాల్సిందే..

రచయితలు, పాత్రికేయులు, సంపాదకులకు.. ఎవరి శైలిలో వారికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అవి అప్పటికప్పుడు పుట్టుకొచ్చేవికావు. అవి వారు పుట్టిన ప్రదేశం నుంచి, వయస్సు పెరుగుతున్న క్రమంలో వారికి ఎదురయ్యే పరి ణామాల నుంచి, వారి చదవిన పుస్తకాల నుంచి వస్తాయి.

ఇక రాజకీయ అభిప్రాయాల విషయంలో దేశంలో ప్రధానంగా లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అభిప్రాయాలే ఎక్కువ మంది మీడియా ప్రతినిధుల్లో ఉంటాయనేది వాస్తవం. ఆ తర్వాతి స్థానా ల్లో ఇతర విశ్వాసాలు కలవారు ఉంటారు. జర్నలిస్టులు, సంపాదకులను దండగులు హత్య చేసి ఉండవచ్చు గానీ, వాళ్ల భావజాలాన్ని హత్య చేయలేరు కదా! పౌర హక్కుల కార్యకర్తలు, మేధావులు, రచయితలు, కవులు కళాకారులు సామాజిక బాధ్యతగా పత్రికా స్వేచ్ఛ కోసం గళమెత్తుతున్నారు. ప్రజాస్వామిక, రాజ్యాంగవిలు వల గురించి మాట్లాడుతున్నారు. 

పౌర సమాజం కూడా పత్రికా స్వేచ్ఛపై స్పందిస్తే బాగుంటుంది. ప్రతిఒక్కరి బాధ్యతగా స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. రాజ్యాంగ వ్యవస్థకు నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే దేశ సౌభ్రాతృత్వానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు వస్తాయి. పత్రికా స్వేచ్ఛ సూచికలో ఎప్పటిలాగానే నార్వే అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇస్తోనియా, నె దర్లాండ్ దేశాలు ఉన్నాయి.

1993 నుంచి ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఏటా మే-3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 ‘విండ్ హోక్ డిక్లరేషన్’ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది.

ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు సిద్ధం చేసిన ప్రకటన. 2023వ సంవత్సరానికి సంబంధించి పత్రి కా స్వేచ్ఛ సూచికలో భారత్ 161 స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి.